Thursday, May 28, 2020

కరోనా కొన్ని జాగ్రత్తలు



1. వైరస్ అంటే విషం అని అర్ధం. వైరస్ సజీవి కాదు, నిర్జీవి కాదు. రెండిటిమధ్య సంధానకర్త. కారణం దీనిలో జన్యుపదార్ధం ఉంటుంది కానీ స్వతహాగా విభజన చేసుకోలేదు మరియూ వైరస్ ఒకచోట నుంచి ఇంకోచోటుకు కదలలేదు. 

2. వైరస్ లు అతి సూక్షం గా ఉంటాయి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో మాత్రమే వైరస్ లని క్లియర్ గా చూడగలం. వైరస్ లు వాటిలో ఉండే జన్యుపదార్ధాన్ని బట్టి 7 రకాలు. ప్రస్తుతం వ్యాప్తి లో ఉన్న కరోనా వైరస్ అనేది వైరస్ ల వర్గీకరణ లో ఐదవ గ్రూప్ "నెగటివ్ సెన్స్ సింగిల్ స్ట్రాండడ్ RNA వైరస్" నకు చెందినది.  ప్రస్తుతం వ్యాప్తి లో ఉన్న వైరస్ జన్యుపదార్ధం కూడా 80% సార్స్ కరోనా వైరస్ లాగే ఉండటం వలన ఈ వైరస్ కి "SARS కరోనా వైరస్ - 2" (SARS  CoV-2) అని పేరు పెట్టారు, దీనివలన కలుగుతున్న వ్యాధి కి కరోనావైరస్ డిసీజ్ ఆఫ్ 2019 (కోవిడ్-19) అని పేరు పెట్టారు (  వాడుక లో కరోనా వైరస్# "SARS కరోనా వైరస్ -2).  

4. ఈ వైరస్ లో 11 జీన్స్ ఉన్నాయి. 5UTR -orf1ab జీన్, S జీన్, ORF3a జీన్, E జీన్, M జీన్, ORF6a జీన్, ORF7a జీన్, ORF7b జీన్, ORF8 జీన్, N జీన్, ORF10 జీన్- 3UTR. 

5. బొమ్మ లో పింక్ కలర్ లో చుట్టుకొని స్ప్రింగ్ లా ఉన్నది దాని జన్యుపదార్ధం. జన్యుపదార్ధం తాడు లా ఉండటం వలన తనలో తాను జీన్స్ లో మార్పులు చేసుకొని, మ్యుటేషన్స్ జరిగి మరింత ప్రమాదకరమైన వైరస్ లా మారొచ్చు లేదా ప్రమాదరహిత వైరస్ లా కూడా మారొచ్చు. మ్యుటేషన్స్ జరిగి మరింత ప్రమాదకారకం గా మారటానికి అవకాశాలు ఎక్కువ.

6. పసుపు రంగులో ఉన్న "స్పైక్ గ్లైకో ప్రోటీన్స్" అనబడే కొమ్ములది ప్రధాన పాత్ర. ముక్కు, నోరు ద్వారా గొంతు నుంచి ఆహారనాళం లోకి వైరస్ పోతే ఏమీ అవ్వదు, అక్కడ విడుదలయ్యే యాసిడ్స్ కి వైరస్ చనిపోతుంది. కానీ గొంతు దగ్గర ఉన్నప్పుడు ఈ స్పైక్ గ్లైకో ప్రోటీన్స్ అనే కొమ్ములు ద్వారా అక్కడే అతుక్కొని ఊపిరితిత్తుల వైపు వెళ్తే కోవిడ్-19 డిసీజ్ వస్తుంది. నిజానికి సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తి లో వైరస్ శరీరం లోకి ప్రవేశించగానే యాంటీబాడీస్ విడుల అయ్యి స్పైక్ గ్లైకో ప్రోటీన్స్ అనే కొమ్ములకి అతుక్కొని వైరస్ లని నిర్వీర్యం చేస్తాయి. అందుకే పసుపు రంగులో ఉన్న కొమ్ములు చెడు గా చూస్తే వాటి ద్వారా మన శరీరం లోని కణాలకి అతుక్కొని వ్యాధి ని కలుగ జేస్తాయి. మంచి గా చూస్తే అలాంటి కొమ్ములు ఉండటం వలన మన యాంటీబాడీస్ కి  తేలికగా వైరస్ కి అతుక్కొని నిర్వీర్యం చేస్తాయి.

7. వ్యాక్సిన్ వచ్చినా అది చేసే పని మన శరీరం లో పడుకున్న యాంటీబాడీస్ ని లేపటం, అంతవరకే. అంతకుమించి ఏ పనీ చేయవు. ప్రతి రోజూ 20-30 నిమిషాలు వ్యాయామం చేస్తూ, సరైన నిద్ర, పౌష్టిక ఆహారం తీసుకుంటూ, వత్తిడిని తగ్గించుకొని జీవన విధానాన్ని మార్చుకోవటం ద్వారా కూడా సరైన మోతాదు లో యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేసుకోవచ్చు. 

నిత్య సత్యము

 బంధాలు దూరంగా ఉన్నప్పుడు అందంగా ఆకర్షణతో ఉంటాయి... ప్రేమను పంచుతాయ్.. అవే బంధాలు దగ్గరయ్యానక
 విరక్తిని, ద్వేషాన్ని కలిగిస్తాయి... 







కారు లో షికారు